రానా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

ప్ర‌స్తుతం ఇండియన్ స్క్రీన్‌పై బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో మ‌హాన‌టి విజ‌యంతో ఈ త‌ర‌హా సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో.. స్టువ‌ర్ట్‌పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితంపై ఓ బ‌యోపిక్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దొంగాట‌, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రాలో చెప్పుకోద‌గ్గ విజ‌యాలు అందుకున్న వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. మొద‌ట ఈ సినిమాలో రానా ప్ర‌ధాన పాత్ర పోషించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వచ్చాయి.

అయితే.. మ‌ల్ల యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు బ‌యోపిక్ కూడా చేయాల్సి ఉండ‌డం వ‌ల్ల‌.. ఒకే సారి రెండు బ‌యోపిక్‌లు చేయ‌డం రిస్క్ అవుతుందేమోన‌ని త‌ను బ‌య‌ట‌కి వ‌చ్చేశార‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమాలో మ‌రో యువ క‌థానాయకుడు నానిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.