మెగా 156లో చిరంజీవికి విలన్‌గా దగ్గుబాటి రానా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగా 156వ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. విజయ దశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో చిరుకు విలన్‌గా దగ్గుబాటి హీరో రానా నటించనున్నట్లు చెబుతున్నారు. విలన్ రోల్ కోసం చిత్ర బృందం రానాను సంప్రదించగా ఆయన కూడా ఓకే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, రానా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం విధితమే.
ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' మూవీలో రానా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. పూర్తి స్తాయి విలన్ రోల్ కాకపోయినా పవన్‌తో సమానమైన పాత్ర చేశారు. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ రానా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డును బద్దలుకొట్టిన బాహుబలి చిత్రంలో రానా విలన్‌గా అద్భుతంగా యాక్ట్ చేశారు. అటు హీరోతో పాటు ఇటు కీలకమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్నారు.
పాటల రికార్డింగ్‌తో మెగా 156 చిత్ర షూటింగ్‌ను మంగళవారం మొదలుపెట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనుంది. పూజా కార్యక్రమంలో దర్శకుడు వశిష్ఠకు చిరంజీవి, సురేఖ దంపతులు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్, మారుతి సహా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments