బయోపిక్‌లో రానా దగ్గుబాటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. సినీ, రాజకీయం, క్రీడలు ఇలా పలు రంగాల్లోని కీలక వ్యక్తుల బయోపిక్స్ రూపొందుతున్నాయి. సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ కూడా 'యన్టీఆర్' బయోపిక్ రూపొందింది. సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు జయలలిత బయోపిక్‌గా 'తలైవి' రూపొందనుంది. ఇవన్నీ కాకుండా ఆంధ్రుల అందగాడు, సోగ్గాడు శోభన్‌బాబు బయోపిక్ రూపొందనుందని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటుందని టాక్.
తాజా సమాచారం మేరకు శోభన్‌బాబు బయోపిక్‌లో రానా దగ్గుబాటి నటిస్తారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వ్యవహారంపై శోభన్‌బాబు అభిమానులు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. అలాగే శోభన్‌బాబు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారా లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. శోభన్‌బాబు లైఫ్ జర్నీ, సినీ ప్రయాణంలో కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా ఉండిపోయాయి. అందులో ఒకటి శోభన్‌బాబు, జయలలిత ప్రేమించుకున్నారని. మరి శోభన్‌బాబు బయోపిక్‌ను తెరకెక్కిస్తే ఈ పాయింట్‌ను టచ్ చేస్తారా? అనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments