అభిమానులు, స్నేహితులు.. ఆందోళన వద్దు: రానా

  • IndiaGlitz, [Saturday,August 31 2019]

రానా దగ్గుబాటి... తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలో భల్లాల పాత్రతో మెప్పించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఫ్రెండ్లీ నేచర్ తో ఇండస్ట్రీ లోనూ బోలెడు మంది స్నేహితులు ఉన్నారు.

రానా ఈ మధ్య కిడ్నీ సంబంధించిన వ్యాధికి గురి కావడంతో అమెరికాలో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఇది సక్సెస్ ఫుల్ గా జరిగింది కూడా. తను బాగానే ఉన్నాను అని... అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కూడా రానా. తాను ఈరోజు ఇండియా వస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ... ఇంకా అమెరికాలోనే ఉన్నారు రానా.

చికిత్స పూర్తి అయినా... మరి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది అని .. అన్ని చేయించుకుని వెళ్తే బాగుంటుంది అని తెలిపారట వైద్యులు. దీంతో వారి సలహా మేరకు అక్కడే ఉండిపోవలసి వచ్చిందట రానా. మరో రెండు వారాలు అక్కడే ఉండాల్సి వస్తుంది అని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ కావాల్సిన విరాట పర్వం సినిమా తొలి షెడ్యూల్ ఆగిపోయింది. మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిరణ్య కశప సినిమా కూడా రానా మీదే ఆధారపడి ఉంది. రానా త్వరగా రికవరీ అయితే ఈ షూటింగ్ లు మొదలు పెట్టాల్సి ఉంది.

More News

చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పిందా?

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి వ్య‌క్తిగ‌త ప‌నిపై ముంబై వెళ్లారు.

మంత్రి బొత్స మాటలు.. మాజీ మంత్రికి అర్థం కాలేదట

ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఆందోళన రేపాయి.

రాజధానిలో జనసేనాని.. ‘ఆళ్ల’ ప్రశ్నల వర్షం!

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకులపై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులపై, ఆర్ధిక విధానాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆల్‌ ది బెస్ట్‌ యూఎస్‌ కాన్సులేట్‌ : సీఎం జగన్

యూఎస్‌ కాన్సులేట్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.