స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ విజేత యశస్వి కొండేపూడి .... రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రోఫీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆట ఎప్పుడు మొదలైనా గెలుపు ఎవరిది?? విజేత ఎవరు?? అని ఎదురుచూస్తుంటాం. 30 వారాల సుదీర్ఘ ప్రయాణం తరువాత యశస్వి కొండేపూడి, స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ కి విజేతగా నిలిచారు. అతిరధ మహారథుల నడుమ జరిగిన ఈ గ్రాండ్ ఫినాలే కు ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరించగా, మన ప్రియమైన రానా దగ్గుబాటి ట్రోఫీని విజేతకు అందజేశారు.
భరత్ రాజ్ మొదటి రన్నర్-అప్ గా నిలువగా, యశస్వి కొండేపూడి ట్రోఫీ, టైటిల్ తో పాటు 5 లక్షలు ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. ఇంతటి గ్రాండ్ ఫినాలేకు సీద్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్, బాబా సెహగల్, గాయనీమణులు సునీత, కల్పన విచ్చేసారు. సీద్ శ్రీరామ్ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ప్రోగ్రామ్ ని ఇంతటి ఘన విజయం చేసినందుకు అనురాధ గూడూరు - తెలుగు క్లస్టర్ హెడ్ మాట్లాడుతూ, "జీ తెలుగు ఎప్పుడు కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. కరోనా వల్ల ఈసారి స రి గ మ ప ఎలా చెయ్యగలం అనుకున్న సందర్భంలో మాకు తోడుగా నిలిచి ఇంత వరకు నడిపించిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే గెలిచిన యశస్వి కొండేపూడి పాటు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను."
విన్నర్ గా నిలిచినా యశస్వి కొండేపూడి మాట్లాడుతూ, "నేను ఇంకా నమ్మలేకపోతున్న నేను గెలిచాను అని. చాల సంతోషంగా ఉంది. నాకు వోట్ చేసిన నా అభిమానుల అందరికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాకు తోడుగా నిలిచినా జడ్జెస్ మరియు నా మెంటార్స్ అందరికి కూడా నేను శతకోటి నమస్కారములు తెలుపుకుంటున్నాను . అసలు అనుకోలేదు ఇక్కడి వరకు వస్తాను అని, ఇపుడు ఒక ప్రయాణం పూర్తి అయింది, కానీ ఎంతో మధురానుభూతులు మరియు సంగీత పరమైన జ్ఞానం నేను నా వెంట తీసుకువెళ్తున్న అందుకు నేను చాల సంతోషిస్తున్న. ఇది నా జీవితంలో మధురక్షణాలుగా ఎపుడు నిలిచిఉంటాయి."
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments