సెకండ్ షెడ్యూల్లో రానా చిత్రం .. టైటిల్ ఏంటంటే...?

  • IndiaGlitz, [Monday,June 04 2018]

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు, వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న యువ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి. ఈయ‌న ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్‌, గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ చిత్ర‌మే 'హ‌థీ మేరే సాథీ'. చిత్ర నిర్మాణ సంస్థ‌ల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా పేరున్న ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం.

రానా ద‌గ్గుబాటి, పుల్కిత్ సామ్రాట్‌, విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌, క‌ల్కి కోచ్లిన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌భుసాల్మ‌న్ తెలుగు, హిందీ, త‌మిళంలో ఒకేసారి సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. 1971లో విడుద‌లైన బాలీవుడ్‌ క్లాసిక్ మూవీ 'హ‌థీ మేరే సాథీ' స‌హా కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళంలో 'కాడ‌న్‌', తెలుగులో 'అర‌ణ్య‌' పేరుతో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. మ‌నిషి.. జంతువుల‌కు మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో హైలైట్‌గా చూప‌నున్నారు.

రానా ద‌గ్గుబాటి, జోయ‌, కల్కి మూడు భాష‌ల్లోనూ న‌టిస్తుంటే హిందీలో పుల్కిత్ సామ్రాట్ చేసే పాత్ర‌ను త‌మిళఃలో విష్ణు విశాల్‌, తెలుగులో ర‌ఘుబాబు చేస్తున్నారు. శాంత‌ను మొయిత్రా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఏనుగులు వివిధ సంద‌ర్భాల్లో చేసే శ‌బ్ధాల‌ను అర్థం చేసుకోవ‌డానికి రానా థాయ్‌లాండ్‌లో 50 రోజుల వ‌ర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యారు. అలాగే ఈ సినిమా కోసం ఆయ‌న ప‌దిహేను కిలోల బ‌రువు త‌గ్గ‌డం విశేషం. భారీ స్కేల్‌, బ‌డ్జెట్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను థాయ్‌లాండ్‌, కేర‌ళ‌లో చిత్రీక‌రిస్తున్నారు.

More News

క్రీడాకారిణి బయోపిక్ ప్లాన్ చేస్తున్న మ‌హిళా డైరెక్ట‌ర్‌

తెలుగు ప్రేక్షకులకి బయోపిక్‌లు కొత్తేమీ కాదు. కాకపోతే.. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రిపై  ‘మహానటి’ రూపంలో  బయోపిక్ విడుదల కావడంతో..

'పందెం కోడి' త‌ర్వాత విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'అభిమ‌న్యుడు' - నిర్మాత గుజ్జ‌ల పూడి హ‌రి

300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జ‌ల‌పూడి హ‌రి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయ‌న హీరోగా న‌టించిన రాయుడు

జులై 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ 'RX 100'

మా 'RX 100' టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ వ‌చ్చాయి

తెలుగు ద‌ర్శ‌కుల‌తో హిందీ చిత్రాలు

‘మనసుకు నచ్చింది’,  ‘రాజుగాడు’ చిత్రాల‌తో తెలుగు వారిని ప‌ల‌క‌రించిన ఉత్త‌రాది భామ అమైరా ద‌స్తూర్‌.

గ్రామీణ నేపథ్యంలో వెంకీ, చైతు సినిమా?

విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో