పవన్ కళ్యాణ్ గారి అనుభవం అపారమైనది : రానా దగ్గుబాటి

  • IndiaGlitz, [Wednesday,July 28 2021]

రెండు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. వరుస అప్డేట్స్ వస్తుండడంతో అభిమానులు రచ్చ షురూ చేశారు. మలయాళీ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

రానా, పవన్ ఇద్దరూ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రానా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

గత చిత్రాల కంటే ఈ మూవీలో నా రోల్ విభిన్నంగా, ఇంటెన్స్ గా ఉంటుంది. నా పాత్రలో ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఈ మూవీ లో డిఫెరెంట్ రానాని చూస్తారు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను.

తొలిసారి పవన్ కళ్యాణ్ గారితో కలసి నటించడం గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి అనుభవం అపారమైనది. ఆయనకున్న సినిమా నాలెడ్జ్ అద్భుతం. అందులోని లాభనష్టాలని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తితో కలసి నటించడం గొప్ప అనుభూతి.

ఆయన సినిమాని చూసే విధానం విభిన్నంగా ఉంటుంది. ప్రతిసారి ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అంటూ రానా పవన్ అనుభవాన్ని ప్రశంసించాడు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో భీమ్లా నాయక్ గా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. మంగళవారం మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రానా పాత్ర గురించి చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వాల్సి ఉంది.

పవన్ సరసన నిత్యామీనన్, రానాకీ జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.