గర్వంగా ఉందటున్న రానా...
Send us your feedback to audioarticles@vaarta.com
క్యారెక్టర్ బావుంటే చిన్న పాత్ర అయినా చేయడానికి లేదా విలన్ పాత్ర అయినా చేయడానికి ఇష్టపడే నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఇప్పుడు రానా, ఆయన స్వంత బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్ కలిసి ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఆ సినిమాయే 'కేరాఫ్ కంచర పాలెం'. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్, మహా సిత్రాలు పతాకాలపై వెంకట్ మహ దర్శకత్వంలో విజయ్ ప్రవీణ పరుచూరి ఈ సినిమాను నిర్మించారు. 'న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అనుమతి పొందిన తొలి తెలుగు చిత్రమిదేనని ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా, గర్వంగా ఉంది' అంటూ రానా తన ట్విట్టర్ ద్వారా మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com