రానా కుదుట‌ప‌డుతున్నాడ‌ట‌....

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

బాహుబ‌లి స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి బ‌రువు పెర‌గ‌డం.. మ‌ళ్లీ త‌దుప‌రి సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌డం ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల రానా ద‌గ్గుబాటి ఆరోగ్యంపై ఎక్కువ ప్ర‌భావం ప‌డింది. దీంతో ఆయ‌నకు కిడ్నీ స‌మ‌స్య వ‌చ్చింది. అయితే ఆయ‌న కిడ్నీని మార్చబోతున్నార‌ని, రానా అమ్మ‌గారే ఆయ‌న‌కు కిడ్నీఇస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే కిడ్నీకి సంబంధించిన స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్స్ అధ్వ‌ర్యంలో రానా చికిత్స తీసుకోవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని స‌మాచారం. అలాగే రానా ఇప్పుడు స్మోకింగ్ కూడా మానేశాడ‌ట‌. ఏదైతేనేం రానా ఆరోగ్య స‌మ‌స్య నుండి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టం.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆనంద‌మే క‌దా!. మ‌రో వైపు రానా సినిమాల‌తో బిజీ కాబోతున్నాడు.