తెలుగులో రానా ఆస‌క్తిక‌ర‌మైన‌ ట్వీట్..!

  • IndiaGlitz, [Thursday,October 27 2016]

లీడ‌ర్ సినిమాతో హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు ద‌గ్గుబాటి రానా. ఆత‌ర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బ‌హుబ‌లి చిత్రంలో రానా బ‌ల్లాల‌దేవ‌గా అద్భుతంగా న‌టించి జాతీయ,అంత‌ర్జాతీయ‌ స్ధాయిలో పాపుల‌ర్ అయ్యారు. తెలుగు భాష పై రానా కు మ‌క్కువ ఎక్కువ‌. అందుక‌నే ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ న‌టించిన చిత్రాల్లోని భారీ డైలాగ్స్ సైతం నేర్చుకున్నారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా స‌రే ఠ‌క్కున చెప్పేస్తారు.

ఇదిలా ఉంటే...సోష‌ల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉండే రానా ఈరోజు ట్విట్ట‌ర్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసారు. అది ఏమిటంటే...తెలుగులో ట్వీట్ చేసే మొద‌టి ప్ర‌య‌త్నం..! దేశ భాష‌లందు తెలుగు లెస్స అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై సినీ జ‌ర్న‌లిస్ట్ వీర్ని శ్రీనివాస‌రావు స్పందిస్తూ....హాలో బ్ర‌ద‌ర్...ట్వీట్ అనేది కూడా తెలుగులో రాసుంటే బాగుండేది అన్నారు. ఈ ట్వీట్ కి రానా స్పందిస్తూ...ట్వీట్ అనేది ఇంగ్లీషు ప‌దం కాబ‌ట్టి వ‌దిలేసాను అంటూ స‌మాధానం ఇవ్వ‌డం ఓ విశేష‌మైతే...ఈ సంభాష‌ణ‌ను ప్ర‌ముఖ‌ దిన‌ప‌త్రిక వార్త‌గా రాయ‌డం మ‌రో విశేషం..!