'రాజారథం'లో రానా దగ్గుబాటి?

  • IndiaGlitz, [Friday,December 01 2017]

జనవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న 'రాజారథం' చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. 'బాహుబలి'లో 'భళ్లాలదేవుని'గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో 'రాజరథం'పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.

ఇప్పుడు రానా కూడా ఈ టీమ్‌తో కలవడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్‌ హీరో ఆర్య, పి.రవిశంకర్‌ కనిపిస్తారు. ఇప్పుడు

దర్శకుడు అనూప్‌ భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం. నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన 'రంగి తరంగ' చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన 'జాలీ హిట్స్‌' సంస్థ తమ తొలి ప్రయత్నంగా 'రాజారథం' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది.

నిర్మాత అజయ్‌రెడ్డి ఉత్తమ ప్రమాణాలతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాలనే తపనతో టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ 'రాజారథం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఫేవరెట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నసమంత

ఇటీవ‌లే యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకున్న స‌మంత‌.. ఇప్పుడు తిరిగి సినిమాల‌తో బిజీ అయ్యారు. ఓ వైపు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ కి జోడీగా 'రంగస్థలం 1985' చేస్తూనే.. మ‌రోవైపు త‌మిళ క‌థానాయ‌కుడు విశాల్ హీరోగా వస్తున్న‘అభిమన్యుడు' లోనూ న‌టిస్తున్నారు స‌మంత‌.

మిలిటరీ ట్రైనింగ్ అకాడమీలో కమల్ 'విశ్వరూపం 2'

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘విశ్వరూపం 2’ (హిందీలో విశ్వరూప్ 2). ఈ మూవీ షూటింగ్ తిరిగి చెన్నైలో మొదలైంది.

డిసెంబర్ 8న విడుద‌ల‌వుతోన్న 'బీటెక్ బాబులు'

నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్  పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని తెలుగు రాష్ర్టాల్లో  డిసెంబ‌ర్ 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 

నాగార్జున చేతుల మీదుగా 'ఏక్‌' మూవీ ఆడియో విడుదల

కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం 'ఏక్'.

బాలకృష్ణ 'జై సింహా' టాకీ పార్ట్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార