ఓ బేబీలో రానా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ బేబీ సినిమా ప్రమోషన్లలో రానా విగరస్‌గా పాల్గొంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తరఫున ఎప్పుడూ సురేష్ బాబు ప్రమోషన్లలో పాల్గొంటారు. కానీ ఈ సారి ఓ బేబీ విషయంలో సురేష్‌బాబు కన్నా రానా చాలా ఇంట్రస్టింగ్‌గా పాల్గొంటున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలోనూ ఆయనే పాల్గొన్నారు. సక్సెస్మీట్కీ రానా వచ్చారు. ఇంతగా ఓ బేబీ బాగోగులు రానా చూసుకోవడానికి ఓ కారణం ఉందట. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కి తీసుకెళ్లాలన్నది రానా ప్లాన్ అట. బాలీవుడ్లో సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అలియాతో కానీ, కంగనాతోగానీ చేయాలని అనుకుంటోదట. అక్కడ ఈ సినిమాను పూర్తిగా రానా చూసుకోవాలని భావిస్తున్నారు.
అంతే కాదు, తెలుగులో నాగశౌర్య చేసిన పాత్రను హిందీలో అతను చేయాలని అనుకుంటున్నారట. అన్నీ సవ్యంగా కుదిరితే లీడ్ హీరోయిన్ డేట్లు కుదరగానే ప్రాజెక్ట్ మొదలుపెట్టేస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. 70 ఏళ్ల వృద్ధురాలిగా, ఉన్నట్టుండి యవ్వనం వస్తే ఆమెలో చోటుచేసుకునే మార్పులేంటి? మానసికంగా వృద్ధురాలైనప్పటికీ, బాహ్యంగా యవ్వనంగా కనిపించే ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఈ చిత్రంలో ఆసక్తికరం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments