'యన్.టి.ఆర్' బయోపిక్‌లో రానా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'యన్.టి.ఆర్'. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక వ్యక్తి అయిన.. అలాగే అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు పాత్ర కోసం యువ నటుడు దగ్గుబాటి రానా పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది తేజ దర్శకత్వంలో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి'లో రాజకీయ నాయకుడు జోగీందర్ పాత్రలో రానా నటన ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో.. రానా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరనీ.. బాలకృష్ణ, తేజ భావిస్తున్నారట.ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపన నుంచి.. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించడం వరకు సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పేరు వినిపించింది. అయితే.. రానా ఎంపికనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com