చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

'బాహుబ‌లి', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నాడు. ఈలోపు క‌రోనా రావ‌డంతో షూటింగ్స్ అన్నీ ఆగాయి. రానా హీరోగా న‌టించిన చిత్రం అర‌ణ్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సాయిప‌ల్ల‌వితో రానా న‌టిస్తోన్న ‘విరాటపర్వం’ షూటింగ్ ద‌శ‌లో ఉంది. మ‌రోప‌క్క రానా న‌టిస్తాడంటూ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్‌కు సంబంధించిన వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే రానా న‌టించే పౌరాణిక చిత్రం ‘హిర‌ణ్య’ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది.

ఇప్పుడు రానా ఓ స్టార్ హీరో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కూ ఆ సినిమా ఏదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ‘లూసిఫ‌ర్’ రీమేక్‌. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఓ సంద‌ర్భంలో అల్లు అర్జున్ పేరు విన‌ప‌డింది కూడా. అయితే ఈ సినిమాలో రానా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. చిరు 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే ‘లూసిఫ‌ర్’ రీమేక్ గురించి మెగాస్టార్ ఫుల్ ఫోకస్ పెడతాడట. అప్పుడే మరింత క్లారిటీ రానుందని అంటున్నాయి సినీ వర్గాలు.

More News

మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి.

బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.

తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా..

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఛానళ్లలో సీరియల్స్ ఇప్పటికే ప్రారంభమవగా..