చిరు ‘లూసిఫర్’లో రానా..?
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యాక్టర్ రానా దగ్గుబాటి ఆరోగ్య కారణాలతో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈలోపు కరోనా రావడంతో షూటింగ్స్ అన్నీ ఆగాయి. రానా హీరోగా నటించిన చిత్రం అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిపల్లవితో రానా నటిస్తోన్న ‘విరాటపర్వం’ షూటింగ్ దశలో ఉంది. మరోపక్క రానా నటిస్తాడంటూ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అలాగే రానా నటించే పౌరాణిక చిత్రం ‘హిరణ్య’ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది.
ఇప్పుడు రానా ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తాడంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇంతకూ ఆ సినిమా ఏదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘లూసిఫర్’ రీమేక్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఓ సందర్భంలో అల్లు అర్జున్ పేరు వినపడింది కూడా. అయితే ఈ సినిమాలో రానా నటించే అవకాశాలున్నాయని టాక్. చిరు 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘లూసిఫర్’ రీమేక్ గురించి మెగాస్టార్ ఫుల్ ఫోకస్ పెడతాడట. అప్పుడే మరింత క్లారిటీ రానుందని అంటున్నాయి సినీ వర్గాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout