కేరళలో రానా
- IndiaGlitz, [Thursday,January 10 2019]
తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్షకులకు కూడా రానా దగ్గుబాటి సుపరిచితుడైన హీరోయే. రానా చాలా చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
కాగా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘హథీ మేరీ సాథీ’ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఏనుగులతో నటించాలని రానా స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసకుకున్నారు.
షూటింగ్లో ఉండగా కాస్త అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్‌ను గ్యాప్ తీసుకున్న రానా.. ఇప్పుడు మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది.
తమిళంలో కాడన్.. తెలుగులో అరణ్య అనే టైటిల్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా యాభై ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపిసారట. తెలుగు, తమిళ వెర్షన్లో విష్ణు విశాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే.. హిందీ వెర్షన్లో పుల్కిత్ సమ్రాట్ అదే పాత్రలో నటిస్తున్నారు.