రానాకి బీపీ ఎందుకొచ్చిందంటే..?
- IndiaGlitz, [Saturday,June 02 2018]
'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' వరుస హిట్ల మీద ఉన్నారు హీరో రానా. మనసుకు నచ్చిన పాత్ర చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న రానా త్వరలో కుడి కంటికి ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఆయనకు ఎప్పటి నుంచో కుడి కంటి చూపు సరిగా ఉండటం లేదు. ఇదివరకే రానా హైదరాబాద్‌లో కుడి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం లేకపోయింది. పైగా ఈ మధ్య చాలా ఇబ్బంది పెట్టసాగింది. దాంతో అప్రమత్తమైన రానా ఇటీవల తన షూటింగ్స్ కి బ్రేక్ తీసుకున్నారు.
ప్రాథమిక పరీక్షలు యు.ఎస్.లో చేయించుకున్నారు. అన్నీ చేసిన తర్వాత అక్కడి వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారట. దీంతో త్వరలో ఆయనకు యు.ఎస్‌లో ఆపరేషన్ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని రానా ఉబలాటపడుతున్నారు. అయితే ఆయన బీపీ తగ్గకపోవడంతో వీలుకావడం లేదట. రానా అమ్మ తరఫు పెద్దలకు బీపీ ఉందట. అది వంశపారంపర్యంగా వచ్చిందని రానా తండ్రి సురేశ్ బాబు వెల్లడించినట్టు సమాచారం.