'హాథీ మేరే సాథీ' అంటున్న రానా

  • IndiaGlitz, [Friday,December 01 2017]

రానా దగ్గుబాటి.. ఏనుగులతో స్నేహం చేస్తున్నారు. 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటిస్తున్నారు. అదేంటి.. ఇది పాత హిందీ సినిమా క‌దా అనుకుంటున్నారా! నిజమే 1971లో రాజేష్ ఖన్నా, తనూజా హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమాకి ఇది రీమేక్. కాకపోతే కొన్ని యదార్ధ సంఘటనలను కూడా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది.

ప్రభు సోల్మన్ ఈ సినిమాకి దర్శకుడు. తమిళంలో ఈ డైరెక్టర్ చేసిన 'కుంకి', 'మైనా' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిని తెలుగులో 'గజరాజు', 'ప్రేమఖైది'లుగా డబ్ చేయడం జరిగింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. గతంలో వచ్చిన హిందీ సినిమా 'హాథీ మేరే సాథీ' సినిమాని డైరెక్ట్ చేసింది కూడా ఒక తమిళ్ డైరెక్టరే ఎం.ఎ. తిరుముగం.

అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్. మళ్ళీ సుమారు 46 సంవత్సరాల తర్వాత ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ మూవీని తెలుగు, తమిళం,హిందీ భాషల్లో షూట్ చేయబోతున్నారు.

జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇండియా, థాయిలాండ్లలో ఈ మూవీని చిత్రీకరించనున్నారు. అలాగే 2018 దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ నిశ్చయించింది. మిగిలిన విషయాలను అధికారికంగా త్వరలో వెల్లడిస్తారు.

More News

వర్మ సినిమాలో కథానాయికగా మైరా సరీన్

నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. "కంపెనీ" పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని.. జనవరి నుంచి మొదలవ్వబోయే సెకండ్ షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.

2018లో యువి క్రియేషన్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా?

2013లో 'మిర్చి' సినిమాతో ఫిలిం ప్రొడక్షన్లో అడుగు పెట్టింది యువి క్రియేషన్స్ సంస్థ‌. వంశీ, ప్రమోద్  ఈ బ్యానర్ పై నిర్మించిన.. తమ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

కీర్తి బాట‌లో అను ఇమ్మాన్యుయేల్‌

కళకి అవధులు గాని, భాషా భేదం గాని లేదని పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, వస్తున్న నటీమణులు తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే.. ప్రేక్షకులు వారిని తెలుగు అమ్మాయిలుగా ట్రీట్ చేస్తారని భావించి ఈ భామలు తమ తమ క్యారెక్ట‌ర్స్‌ కి డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

బన్నీ, మహేష్ ల మధ్య పోటీ లేనట్లేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా 'నా పేరు సూర్య'. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ సినిమా ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

`అజ్ఞాతవాసి` ఆడియో ఎప్పుడంటే...

పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు.