ఆగష్టు నుంచి రానా, గుణశేఖర్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు గుణశేఖర్ స్టైలే వేరు. ఈయన పేరు చెబితే 'ఒక్కడు' సినిమాలోని చార్మినార్ సెట్, 'అర్జున్' సినిమాలోని మధుర మీనాక్షి గుడి సెట్ కళ్ళ ముందు కదలాడతాయి. ఇక రెండేళ్ళ క్రితం వచ్చిన 'రుద్రమదేవి' సినిమాతో.. చారిత్రక సినిమాలను తెరకెక్కించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గుణశేఖర్. ప్రస్తుతం భారీ స్థాయిలో 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నారు ఈ దర్శకుడు.
"అవకాశం వస్తే పౌరాణిక సినిమాల్లో నటించాలని ఉందని వెల్లడించిన రానాను".. ఈ సినిమాకి ప్రధాన పాత్రధారిగా ఎంపిక చేసారు. ఇది "భక్తప్రహ్లాద" కథే అయినప్పటికీ, హిరణ్యకశిపుడి కోణంలో సాగుతుందని సమాచారం.
ఇదిలా వుంటే... ఈ చిత్రాన్ని ఆగష్టు నుంచి చిత్రీకరించనున్నట్టు ఇన్‌సైడ్ సోర్స్ టాక్. దాదాపు రూ.150 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments