ఆగ‌ష్టు నుంచి రానా, గుణ‌శేఖ‌ర్ చిత్రం

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

చారిత్రాత్మ‌క చిత్రాల‌ను తెరకెక్కించ‌డంలో దర్శకుడు గుణశేఖర్ స్టైలే వేరు. ఈయన పేరు చెబితే 'ఒక్కడు' సినిమాలోని చార్మినార్ సెట్‌, 'అర్జున్' సినిమాలోని మధుర మీనాక్షి గుడి సెట్‌ కళ్ళ ముందు కదలాడతాయి. ఇక రెండేళ్ళ క్రితం వ‌చ్చిన‌ 'రుద్రమదేవి' సినిమాతో.. చారిత్రక సినిమాలను తెరకెక్కించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గుణశేఖర్. ప్రస్తుతం భారీ స్థాయిలో 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నారు ఈ దర్శకుడు.

"అవకాశం వస్తే పౌరాణిక సినిమాల్లో నటించాలని ఉందని వెల్లడించిన రానాను".. ఈ సినిమాకి ప్రధాన పాత్రధారిగా ఎంపిక చేసారు. ఇది "భక్తప్రహ్లాద" కథే అయినప్పటికీ, హిరణ్యకశిపుడి కోణంలో సాగుతుందని సమాచారం.

ఇదిలా వుంటే... ఈ చిత్రాన్ని ఆగష్టు నుంచి చిత్రీకరించనున్నట్టు ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. దాదాపు రూ.150 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని స‌మాచారం.

More News

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు.

మార్చి మొదటి వారంలో 'యుద్ధభూమి'

1971 లో భార‌త స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన చిత్రం '1971 బియాండ్ బార్డ‌ర్స్'. మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో  విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్నిజాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్,  శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి అనువ‌దిస్తున్నార

అభిమానుల సమక్షంలో ఘనంగా విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు

సీనియర్ నటీమణి,దర్శకురాలు,నిర్మాత,గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారు నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు.

హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ వి.ఐ. ఆనంద్

విభిన్నమైన సినిమాలతో ఆయన ప్రయాణం..కొత్త కథలే ఆయన ప్రయత్నం..

హిజ్రా పాత్రలో అనుష్క హీరో...

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన చిత్రాల్లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన 'భాగమతి' ఒకటి.