రానా ఘాజీ ట్రైలర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Tuesday,January 10 2017]

ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న భారీ చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ భారీ చిత్రం టీజ‌ర్ ను రేపు రిలీజ్ చేయ‌నున్నారు. రేప‌టి నుంచి ఘాజీ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేట‌ర్స్ లో ఘాజీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు.
స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ త‌ర‌హాలో హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్ప‌టి వర‌కు తెలుగు ప్రేక్ష‌కులు చూడ‌ని విధంగా ఉండేలా చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి అంటున్నారు చిత్ర‌యూనిట్. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ చేయ‌నున్నారు.
రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్, అతుల్ కుల‌క‌ర్ణి, ఓమ్ పురి, నాజ‌ర్, రాహుల్ సింగ్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి వి.ఎఫ్‌.ఎక్స్ - ఈవిఎ మోష‌న్ స్టూడియోస్, కాస్టూమ్స్ డిజైన‌ర్ అశ్వ‌నాత్ బైరి, స్టంట్స్ - జాషువ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - శివ‌మ్ రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కె, ఎడిట‌ర్ - ఎ శ్రీక‌ర్ ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫి - మ‌ది, అడిషిన‌ల్ స్టోరీ & స్ర్కీన్ ప్లే - నిరంజ‌న్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ & పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ - ఎన్.ఎం. పాషా, ప్రొడ్యూస‌ర్స్ ఆఫ్ మ్యాట్నీ - అన్వేష్ రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, ప్రొడ్యూస‌ర్స ఫ‌ర్ పి.వి.పి సినిమా - పేర‌ల్ వి పొట్లూరి, ప‌ర‌మ్ వి పొట్లూరి, క‌విన్ అన్నే, స్టోరీ, స్ర్కీన్ ప్లే & డైరెక్ష‌న్ - సంక‌ల్ప్.

More News

సంక్రాంతికి వ‌స్తున్న కాట‌మ‌రాయుడు..!

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత చిరంజీవి న‌టించిన చిత్రం రిలీజ్ అవుతుండ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఆడియో రిలీజ్..!

ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌.

నిజ‌మైన అభిమానులు అలాగే కోరుకుంటారు - డైరెక్ట‌ర్ క్రిష్

గ‌మ్యం, వేదం, కృష్ణ‌మ్ వందే జ‌గ‌ద్గురుమ్, కంచె...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.

నిన్నకబాలి - నేడు ఖైదీ నెం 150..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.

యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' ఫస్ట్ లుక్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.