కన్నీళ్లు పెట్టుకున్న రానా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో దగ్గుబాటి రానా కన్నీరు పెట్టుకున్నాడట. ఎందుకో తెలుసా! `జెర్సీ` సినిమా చూసి. సాధారణంగా అమ్మాయిలు, జీవితం, పిల్లలు, క్రికెట్ వంటి కొన్ని విషయాలు తనకు అర్థం కావని.. అలాంటి తనకే జెర్సీ సినిమా చూసి ఏడుపొచ్చిందని అన్నారు రానా. `జెర్సీ` సినిమా చూసిన తర్వాత నానికి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడాడట. అందుకనే జెర్సీ థాంక్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారీయన. `సినిమాలెప్పుడూ శాశ్వతం.. అలాంటి శాశ్వతమైన ఓ జ్ఞాపకంగా జెర్సీ మిగిలిపోతుంది` అని రానా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments