కన్నీటి పర్యంతమైన రానా దగ్గుబాటి

  • IndiaGlitz, [Monday,November 23 2020]

అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమానికి అతిథిగా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను రానా పంచుకున్నాడు. దీంతో పాటు ఒక షాకింగ్ విషయాన్ని కూడా చెప్పి రానా కంటతడి పెట్టించాడు. తనకు పుట్టినప్పటి నుంచ కొన్ని అనారోగ్య సమస్యలున్నాయని సామ్‌జామ్‌ కార్యక్రమంలో రానా పంచుకున్నాడు. గుండెకు సమస్య తలెత్తుతుందని.. మరణానికి 30 శాతం అవకాశముందని డాక్టర్లు చెప్పారని రానా వెల్లడించాడు.

జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో ఒక పాజ్ వచ్చిందని రానా వెల్లడించాడు. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని తెలిపాడు. గుండెకు సైతం సమస్య తలెత్తుతుందని రానా ఆవేదన వ్యక్తం చేశాడు. తన రఆరోగ్య విషయమై వైద్యులు.. తన కిడ్నీలు పాడవుతాయని చెప్పారన్నారు. అలాగే మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం అవకాశముందని.. మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారని రానా కన్నీటి పర్యంతమయ్యాడు.

కాగా.. రానా అనారోగ్యంతో ఉన్నాడంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం నడిచింది. అయితే ఇలాంటి వార్తలను ఆయన ఖండించాడు. అయితే ఇటీవలే రానా ప్రేమ వివాహం చేసుకున్నాడు. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 8వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో మిహికా మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం రానా వివాహం చేసుకున్నారు.

More News

సముద్రంలో స‌మంత సాహ‌సం

స‌మంత అక్కినేని.. పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంది. కానీ, గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు స‌రిక‌దా..

స్టార్ హీరోతో తరుణ్ భాస్కర్

‘పెళ్లిచూపులు, ఈన‌గ‌రానికిఏమైంది’ చిత్రాల త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు.

‘క్రాక్’ సినిమాకు లీగ‌ల్ స‌మ‌స్య‌..!

ర‌వితేజ, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క్రాక్’.

బోర్ కొట్టించిన సండే.. లాస్య ఎలిమినేట్..

సండే.. ఫన్‌డే.. లాస్య ఎలిమినేషన్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. బోర్ కొట్టించే ఫన్ తప్ప..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన యాప్రాల్ ప్రజలు..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.