రూ.180 కోట్ల బడ్జెట్‌తో రానా చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి తరువాత ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్యకశ్యప' పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. రుద్రమ దేవి చిత్రంలో కీలక పాత్ర పోషించిన యువ నటుడు దగ్గుబాటి రానా.. ఈ సినిమాలో టైటిల్ రోల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఈ సినిమాకు అవసరమైన ఇంద్రలోకం, వైకుంఠం వంటి సెట్స్ స్కెచెస్ సిద్ధం చేస్తున్నారట.
కాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభించనున్నారు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో రానా ఫుల్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments