రానాతో రూ.50 కోట్ల బడ్జెట్‌తో..
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ మెప్పించిన యువ నటుడు రానా. బాహుబలి చిత్రాలతో భళ్ళాల దేవగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. గతేడాది విడుదలైన నేనే రాజు నేనే మంత్రిలోనూ విలక్షణమైన పాత్ర చేసి మెప్పించారు. ప్రస్తుతం రానా తెలుగులోనే కాకుండా.. హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. నేనే రాజు నేనే మంత్రి తరువాత తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కించనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివరకు కూడా రానా.. 1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఘాజీ సినిమా చేసినప్పటికీ.. అది జలాంతర్గామి యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా కావడం గమనార్హం. రానా, తేజ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments