వచ్చిన వార్తలన్నీ అవాస్తవం - రానా
Send us your feedback to audioarticles@vaarta.com
భళ్ళాలదేవగా మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించిన దగ్గుబాటి రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంలో రానా నటిస్తాడని, రానాను ఒప్పించడానికి చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ పుకార్లకు రానా దగ్గుబాటి బ్రేక్ వేశాడు. చిరంజీవిగారి సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.
యూనిట్ నన్ను కనీసం సంప్రదించనే లేదని చెప్పేశాడు. రానా క్లారిటీతో ఇప్పుడు వినిపిస్తున్న వార్తలకు బ్రేక్ పడ్డట్టయ్యింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి 151వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే యూనిట్ సభ్యులు నోరు విప్పాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com