రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా
- IndiaGlitz, [Wednesday,June 21 2017]
ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు. హీరోగానే చేయాలని కాకుండా పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుందనిపిస్తే చాలు చిన్న పాత్రలోనైనా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అందుకనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో నటించాడు. ఇప్పుడు రానా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కాకుండా వివి.వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడని న్యూస్ వినపడింది.
అయితే ఈ వార్తలపై రానా గట్టిగానే స్పందించాడు. ట్విట్టర్ ద్వారా స్పందించిన రానా తాను చేయబోయే సినిమాల గురించి తానే చెబుతానని, రూమర్స్‌ను నమ్మవద్దని తెలియజేశాడు. దీంతో రానా. వినాయక్ కాంబినేషన్లో సినిమా గురించి వినపడుతున్న వార్తలు అవాస్తవమని తేలిపోయాయి. రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. జూన్ 23న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రానా జోగిందర్ అనే పొలిటీషియన్ పాత్ర చేస్తున్నాడు.