హీరోగా రానా తమ్ముడు
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ మొఘల్ రామానాయుడు ఇద్దరు మనవళ్ళలో ఒకరైన దగ్గుబాటి అభిరాం త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడట. సీనియర్ వంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యాషన్ డిజైనర్(పరిశీలనలో ఉంది) చిత్రంలో హీరోగా కనపడనున్నాడు. ఈ చిత్రంలో ముందుగా రాజ్ తరుణ్ నటిస్తాడని అనుకున్నప్పటికీ ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడని తన స్థానంలోనే అభిరాం చేయబోతున్నాడని టాక్.
ఈ చిత్రంలో వీలైనంత మంది కొత్త నటీనటులను ప్రెజెంట్ చేయాలని దర్శకుడు వంశీ భావిస్తున్నాడట. గతంలో వంశీ డైరెక్ట్ చేసిన లేడీస్ టైలర్కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కనుంది. మరి అభిరాం సినీ ఎంట్రీ గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments