Rana:‘రాక్షస రాజా’గా రానా.. ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో ఈజ్ బ్యాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో దగ్గుబాటి రానా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. తనకు బ్లాక్బాస్టర్ హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు ‘రాక్షస రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రానా మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. నుదిటికి నామాలు, నోటిలో సిగర్, చేతిలో మెషిన్ గన్ పట్టుకొని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో మంచి భజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రానికి సీక్వెల్‌నా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.
కాగా తేజ దర్శకత్వంలో రానా హీరోగా 2017లో విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయింది. కాజల్ అగర్వాల్, కేథరిన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ రానా కెరీర్లోనే బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా నటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వీరిద్దరి కలయికలో మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. రానా, తేజ కూడా తమ కాంబోలో మరో మూవీ ఉంటుందని చెబుతూ వచ్చారు. మొత్తానికి ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్. ఇందులో ఇద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించిన ఈ సిరీస్ పలు వివాదాల్లో నిలిచింది. ఇందులో మోతాదుకు మించి వల్గర్ కంటెంట్ ఉందని.. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో బూతులు మాట్లాడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా కానీ ఈ సిరీస్ మాత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ మరో అరుదైన ఘనతను సాధించింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 2023 జనవరి నుంచి జూన్ వరకు ఎక్కువ వ్యూస్ వచ్చిన జాబితాలో 'రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సిరీస్ కూడా ఇదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com