50 ఏళ్ల వ్యక్తి పాత్రలో రానా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్షకులకు కూడా రానా దగ్గుబాటి సుపరిచితుడైన హీరోయే. రానా చాలా చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
కాగా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన బాలీవుడ్ మూవీ `హథీ మేరీ సాథీ` సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో రానాతో పాటు 15 ఏనుగులు కూడా కనిపిస్తాయి. కాబట్టి వీటితో రానా దోస్తి చేయాల్సి వస్తుంది. ఈ సినిమా కోసమని రానా ఏనుగులతో ఉండేలా ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. షూటింగ్‌లో ఉండగా రానా కాస్త అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్‌ను గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభం కానుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా యాభై ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపిస్తాడట. తెలుగు, తమిళ వెర్షన్‌లో విష్ణు విశాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే.. హిందీ వెర్షన్‌లో పుల్కిత్ సమ్రాట్ అదే పాత్రలో నటిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments