చైతుతో మూవీ ఎనౌన్స్ చేసిన రానా..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్యకు నటన మీదే కాకుండా నిర్మాణ రంగం మీద కూడా ఆసక్తి ఉంది. అందుకనే నాగచైతన్య ఒక లైలా కోసం చిత్ర నిర్మాణం అంతా తనే దగ్గరుండి చేసుకున్నాడు. ఇక దగ్గుబాటి రానాకు కూడా నటనతో పాటు నిర్మాణ రంగం మీద కూడా ఇంట్రస్ట్ ఉంది. అందుకనే రానా రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కొవెలమూడితో బొమ్మలాట అనే చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఇప్పుడు బావా, బావమరుదులు ఇద్దరూ కలిసి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. అయితే...ముందుగా నాగచైతన్య హీరోగా రానా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ మూవీ తర్వాత చైతన్య, రానా కలిసి సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. హీరోలుగా సక్సెస్ అయిన చైతు, రానా నిర్మాతలుగా కూడా విజయం సాధిస్తారని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com