మీ పని మీరు సరిగ్గా చేయండి.. నా పని నన్ను చేసుకోనివ్వండి: రానా
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ముంబైకి మీడియాకు చెందిన ఓ జర్నలిస్ట్‌పై మండిపడ్డారు. సదరు జర్నలిస్ట్ తనపై రాసిన వార్తను రానా ఖండించారు. వివరాల్లోకెళ్తే.. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న టాలెంట్ మేనేజ్‌మెంట్ క్వాన్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లాతో కలిసి రానా దగ్గుబాటి డిన్నర్ చేశాడని ఓ పత్రిక ప్రకటించింది. గతంలో అనిర్బన్ బ్లాపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఏజెన్సీ నుండి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రానాపై వచ్చిన కథనం చదివిన పలువురు నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేశారు. రానాను చూసి సిగ్గుపడుతున్నాం అంటూ హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.
దీనిపై రానా ఘాటుగా స్పందించారు. సదరు పత్రికను ట్యాగ్ చేస్తూ ‘మీరు ఊహించుకోవడానికి ముందు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నానో తెలుసుకోండి. మీ దగ్గర నా నెంబర్ ఉంటే నన్ను సంప్రదించండి.. లేదా నా పీఆర్ టీమ్‌ను సంప్రదించండి’ అని పేర్కొన్నారు. దీంతో రానాపై వచ్చిన కథనం తప్పని తేలింది. ఆ సమయంలో తాను వికారాబాద్ అడవుల్లో షూటింగ్‌లో ఉన్నానని, బెంగళూరులో డిన్నర్ చేశానని రానా తెలిపారు.
అయితే తర్వాత రోజు సదరు జర్నలిస్ట్ అనిర్బన్ బ్లా డిన్నర్‌కు రానాను ఆహ్వానించారు. కానీ రానా వెళ్లలేకపోయారు. మేం తప్పుగా ప్రచురించాం అంటూ రాసింది. దీంతో రానాకు మరింత కోపం వచ్చింది. సదరు జర్నలిస్ట్‌ను ట్యాగ్ చేస్తూ ‘మీ తప్పును కవర్ చేసుకోవడానికి నేను డిన్నర్ షెడ్యూల్ వేసుకున్నట్లు రాశారు. నీ పట్ల సిగ్గు పడుతున్నా. మీ పని మీరు సరిగ్గా చేయండి. నా పని నన్ను చేసుకోనివ్వండి ప్రముఖ పత్రికలో చెత్త రాయకండి’ అంటూ రానా పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com