అప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సంబంధిత సమస్యలొచ్చాయి: రానా

  • IndiaGlitz, [Thursday,March 25 2021]

రానా దగ్గుబాటి హీరోగా రెండు ఆసక్తికర కథాంశాలతో సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి ‘అరణ్య’ కాగా.. మరొకటి ‘విరాటపర్వం’. రెండు సినిమాల కాన్సెప్ట్‌లు భిన్న మైనప్పటికీ కథాంశాలు మాత్రం ఆసక్తికరం. ‘విరాటపర్వం’ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కితే.. ‘అరణ్య’ యానిమ‌ల్ కాన్‌ఫ్లిక్ట్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏనుగులు, అడవి నేపథ్యంలో దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించిన ఈ కథలో రానా విలక్షణ పాత్రలో కనిపించారు.

ఇప్పటికే విడుదలైన సినిమా అప్‌డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. టీజర్, ట్రైలర్‌లలో అసలు ఇతను రానాయేనా అనేట్టుగా మెస్మరైజ్ చేశారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర విశేషాలను రానా మీడియాతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన అనారోగ్య సమస్యల గురించి కూడా వెల్లడించాడు. నిజానికి ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడే దర్శకుడు ‘అరణ్య’ కథను తనకు వివరించారని.. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడు పాత్ర కోసం చాలా భారీగా కండలు పెంచానని.. అయితే ఈ సినిమా కోసం ఎలా మేకోవర్ ఉండాలో దర్శకుడు ముందే చెప్పారన్నారు. ఆ సమయంలోనే తనకు ఆరోగ్యపరమైన చిక్కులు వచ్చాయని రానా తెలిపాడు.

కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే తాను సర్జరీ చేయించుకుని పూర్తిగా కోలుకునే వరకూ దర్శకుడు ప్రభు తనకు సమయం ఇచ్చారని.. అందువల్లే అరణ్య వంటి సినిమాలో నటించే అద్భుత అవకాశం లభించదని రానా తెలిపాడు. ఇది తన జీవితంలో లభించిన అరుదైన అవకాశంగా అభిప్రాయపడ్డాడు. రియల్ లైఫ్‌లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్.. రీల్ లైఫ్‌ని డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతోనే షూటింగ్‌లలో పాల్గొనేవాడినని రానా వెల్లడించాడు. షూటింగ్‌కి వెళ్లిన తరువాత అనారోగ్య సమస్యలు కానీ.. బాధలు కానీ ఉండేవి కాదని.. తనకు సినిమాలు.. అనారోగ్య సమస్యల్ని అధిగమించడానికి ఎంతగానో దోహదపడ్డాయని రానా చెప్పాడు.

More News

విలన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు!

మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా దృష్టి సారించారు.

ఇంటి అద్దె.. నెలకు రూ.2 కోట్లు!

ఇంటి అద్దె రూ.10 వేలు అంటేనే.. ముచ్చెమటలు పోసి.. మూడు చెరువుల నీళ్లు తాగినంత పనవుతుంది కొందరికి. కానీ వారానికి అర కోటి అంటే నెలకు అక్షరాలా రూ.2 కోట్లు

‘కార్తికేయ 2’ షూటింగ్‌కి మరోసారి బ్రేక్

‘కార్తికేయ 2’ షూటింగ్‌కి మరోసారి బ్రేక్ పడింది. నిఖిల్, అనుపమా పరమేశ్వర్వన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’.

సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నయనతార!

మరో స్టార్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమవుతోంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైన విషయం తెలిసిందే.

రాజమండ్రిలోని ఓ కాలేజ్‌లో 175 మంది విద్యార్థులకు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కాస్త సేఫ్ జోన్‌లో ఉందిలే అనుకుంటే ఇప్పుడు అక్కడ కూడా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.