జయరామ్ మృతదేహాన్ని చూసి పరుగులు తీశారు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ హత్యకేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. మొదట ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా రాకేశ్ రెడ్డిని పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే విచారణలో కూపీ లాగగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. ఆ తర్వాత విశాల్, నగేష్, నటుడు సూర్య హస్తం కూడా ఉందని తేల్చారు. అయితే తాజాగా మరో మగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్ భర్త పేరు వెలుగులోకి రావడం గమనార్హం. కౌన్సిలర్ భర్తతో పాటు అంజిరెడ్డి, శ్రీను, రాము ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వీరంతా రాకేశ్‌రెడ్డితో కలిసి రియల్‌ఎస్టేట్ చేసేవారని విచారణలో తేలింది. అంతేకాదు ప్రస్తుతం విచారణకు హాజరైన వారిలో ఒకరిద్దరికి రాకేశ్ డబ్బులు కూడా ఇవ్వాలని సమాచారం.
షాకై పరుగులు తీసి..!
పక్కా ప్లాన్ ప్రకారం జయరామ్‌ను హత్య చేసిన రాకేశ్.. తర్వాత ఏం చేయాలో ఆ డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆలోచనలో పడి అంజిరెడ్డి, అతని మిత్రులను ఇంటికి పిలిపించుకున్నాడని విచారణలో తేలింది. అయితే జయరామ్ డెడ్ బాడీని చూసిన అంజి షాక్ అయ్యి అక్కడ్నుంచి పరుగులు తీసినట్లు పోలీసులకు వివరించాడు. ఈ వ్యవహారంలో రాకేశ్‌రెడ్డిని లోతుగా విచారిస్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అందుకే అనుమానం వచ్చిన వాళ్లందర్నీ వరుసగా పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా రాకేశ్ రెడ్డి మిత్రులను, బిజినెస్ పార్టనర్స్‌ను కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరో 8 రోజులు కస్టడీ..
ఇప్పటికే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అయితే తీగలాగితే డొంక కదిలినట్లుగా రాకేశ్‌ను విచారించే కొద్ది ఈ హత్యకేసులో భాగమైన మిత్రులందరూ విచారణకు హాజరవుతున్నారు. అందుకే రాకేశ్, శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును పోలీసులు ఆశ్రయించారు. కోర్టు అంగీకారంతో చంచల్‌గూడ జైలు నుంచి రాకేశ్, శ్రీనివాస్‌లను జూబ్లిహిల్స్ పోలీసులు కస్టడీకి అంగీకరించడం జరిగింది. అయితే మున్ముంథు రాకేశ్ ఏమేం విషయాలు చెబుతాడో..? ఇంకెన్ని ట్విస్ట్‌లు వెలుగుచూస్తాయో తెలియాలంటే ఈ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout