ఎన్టీఆర్ 30 కీల‌క పాత్ర‌లో శివ‌గామి!

  • IndiaGlitz, [Monday,September 21 2020]

ర‌మ్య‌కృష్ణ టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బాహుబ‌లి పుణ్య‌మాని రాజ‌మాత శివ‌గామి దేవిగా తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంది. బాహుబ‌లి త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ చాలా సినిమాలే చేసినా ఆ రేంజ్ పాత్ర‌లు రాలేదు. అయితే ఆమెను ప్రేక్ష‌కులు శివ‌గామిగానే చూస్తున్నారు. న‌టిగా ఆమె త‌న‌ను తాను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అయితే మాత్రం ఆమెకు త‌గ్గ పాత్ర‌లు రాలేద‌నే చెప్పాలి. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ర‌మ్య‌కృష్ణ కోసం మాట‌ల మాంత్రికుడు ఓ అద్భుత‌మైన క్యారెక్ట‌ర్‌ను రాశార‌ట‌.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌లేదు. వీరి క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే త‌దుప‌రి చిత్రంను అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్తికాగానే తార‌క్ త్రివిక్ర‌మ్ సినిమానే మొద‌లు పెట్ట‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ కోసం త్రివిక్ర‌మ్ రాసిన పాత్ర హైలెట్‌గా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ర‌మ్య‌కృష్ణ నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో ఏమైనా క‌నిపిస్తారేమో చూడాల‌ని ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

కొత్త జోన‌ర్‌కు చైతు ఓకే అంటాడా?

టాలీవుడ్ ట్రెండ్ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీస్‌లో న‌టించ‌డానికి స్టార్స్‌,

సంతకం పెట్టకుంటే తిరుమల అపవిత్రమవుతుందా?: కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

తిరుమలలో డిక్లరేషన్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త‌మ‌న్నాకి ఏమైంది..?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ఏమైంద‌ని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్..

ఒక లైలా కోసం సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫ్ నామినేట్ అవడం కరెక్ట్ కాదని నాగ్ మరోసారి కరాటే కల్యాణికి సూచించారు.

మధుమిత ఓ ఛానల్ లైవ్‌లో ఉండగా.. షాకింగ్ విషయం చెప్పిన టీచర్..

ఆన్‌లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై ఇటీవల నటుడు శివబాలాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే.