రమ్యకృష్ణ వారికి మరోసారి కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Monday,November 30 2015]

శివ‌గామిగా 'బాహుబ‌లి'లో అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది నిన్న‌టి త‌రం అందాల న‌టి ర‌మ్య‌కృష్ణ‌. ఆ సినిమా త‌రువాత ర‌మ్య‌కృష్ణ నుంచి రానున్న సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టి ప‌డుతోంది. ఈ వ‌రుస‌లో ఆమె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రెండు సినిమాలు విడుద‌లకు సిద్ధ‌మ‌య్యాయి. ఆ రెండు కూడా ఒక‌ప్ప‌టి త‌న హిట్ పెయిర్‌ల‌తో జ‌త‌క‌ట్టిన సినిమాలే కావ‌డం విశేషం.

'అల్లుడు గారు', 'అల్ల‌రి మొగుడు' త‌దిత‌ర హిట్ చిత్రాల కోసం మోహ‌న్‌బాబుతో జ‌త‌క‌ట్టిన ర‌మ్య‌.. తాజాగా 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా కోసం మ‌రో సారి న‌టించింది. ఈ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న రానుంది.

ఇక 'హ‌లో బ్ర‌ద‌ర్‌', 'ఘ‌రానా బుల్లోడు', 'అన్న‌మ‌య్య' వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాల కోసం నాగార్జున‌తో జోడీ క‌ట్టిన ర‌మ్య కృష్ణ‌.. అత‌నితో మ‌రోసారి 'సోగ్గాడే చిన్ని నాయ‌నా' కోసం క‌లిసి న‌టిస్తోంది. ఈ సినిమా ఏమో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి ప్ర‌థ‌మార్థంలో రానుంది. అంటే మూడు వారాల గ్యాప్‌లో ర‌మ్య‌కృష్ణ నుంచి రెండు సినిమాలు రానున్నాయ‌న్న‌మాట‌. ఒక‌ప్ప‌టి త‌న హిట్ పెయిర్‌ల‌తో మ‌రోసారి సంద‌డి చేస్తున్న ఈ రెండు సినిమాలు.. ర‌మ్య‌కృష్ణ‌కి మంచి విజ‌యాల‌ను అందించాల‌ని ఆశిద్దాం.