భారీ రెమ్యునరేషన్ అడిగిన రమ్యకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి బాలీవుడ్ రీమేక్ సినిమా కూడా ఉంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించిన `అంధాదున్` సినిమా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. దాని రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
లేటెస్ట్ సమాచారం మేరకు రీమేక్‌లో టబు చేసిన పాత్రను తెలుగులోనూ టబు చేస్తుందని కొన్నిరోజులు.. మరి కొన్ని రోజుల తర్వాత అనసూయ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు రమ్యకృష్ణ పేరు ప్రముఖంగా వినపడుతుంది. నెగెటివ్ టచ్‌తో సాగే ఈ పాత్రలో నటించడానికి రమ్యకృష్ణను సంప్రదిస్తే ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై క్లారిటీ రాలేదు. కరోనా ప్రభావం వల్ల కొనసాగుతోన్న లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత నితిన్ అండ్ కో ఈ రీమేక్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments