భారీ రెమ్యున‌రేష‌న్ అడిగిన ర‌మ్య‌కృష్ణ‌

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన 'భీష్మ'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి బాలీవుడ్ రీమేక్ సినిమా కూడా ఉంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు న‌టించిన 'అంధాదున్' సినిమా పెద్ద హిట్టైన సంగ‌తి తెలిసిందే. దాని రీమేక్ హ‌క్కుల‌ను నితిన్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

లేటెస్ట్ సమాచారం మేరకు రీమేక్‌లో ట‌బు చేసిన పాత్రను తెలుగులోనూ టబు చేస్తుంద‌ని కొన్నిరోజులు.. మ‌రి కొన్ని రోజుల త‌ర్వాత అన‌సూయ చేస్తుందంటూ వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు ర‌మ్య‌కృష్ణ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. నెగెటివ్ ట‌చ్‌తో సాగే ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి ర‌మ్య‌కృష్ణ‌ను సంప్ర‌దిస్తే ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పుడు నిర్మాత‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై క్లారిటీ రాలేదు. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల కొన‌సాగుతోన్న లాక్ డౌన్ ఎత్తేసిన త‌ర్వాత నితిన్ అండ్ కో ఈ రీమేక్‌పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని టాక్‌.

More News

మే-03 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వెనుక 3 కారణాలు..!

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది.

ఏప్రిల్-20 తర్వాత సడలింపులు.. ఒక్క కేసు పెరిగినా..: మోదీ

ఏప్రిల్- 20వరకూ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్‌లు లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ

కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

అర‌వింద స‌మేత త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై

నిర్మాతగా కొరటాల శివ.. తొలి అవకాశం ఎవరికంటే?

ఇప్పుడు నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగా ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో సినిమాలు చేయ‌డ‌మే కాకుండా కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డం,