మలయాళీ దేవతగా రమ్యకృష్ణ...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

అందం - అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న ర‌మ్య‌కృష్ణ బాహుబ‌లి సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. బాహుబ‌లి త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో ఆక‌ట్టుకోవ‌డం...అది కాస్త బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో ర‌మ్య‌కృష్ణ డిమాండ్ మ‌రింత పెరిగింది.
క‌మ‌ల్ హాస‌న్ తో ఓ మూవీ, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రుద్రాక్ష చేయ‌డానికి ర‌మ్య‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌మ్య‌కృష్ణ మ‌ల‌యాళీ మూవీ ఆడుపులియాట్టం లో న‌టించేందుకు అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ దేవ‌త‌గా న‌టిస్తున్నార‌ట‌. సీనియ‌ర్ హీరో జ‌య‌రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఓంపురి కూడా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.