బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్లో సందడికి భారీ ప్లాన్...?
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు బిగ్‌బాస్ హోస్ట్స్ అందుబాటులో లేకపోతే.. వారి స్థానంలో మరొక సెలబ్రెటీ షో హోస్ట్‌గా వ్యవహరించిన దాఖలాలు ఎన్నో వున్నాయి. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో హోస్ట్‌గా వున్న నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్ చేశారు. దీంతో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ టీఆర్పీ ఆకాశాన్ని తాకింది. తాజాగా ప్రస్తుత తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. అయితే అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన కమల్‌కు కోవిడ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 5కి కొత్త హోస్ట్‌ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్ ప్లేస్‌లో తాత్కాలికంగా ఆయన కుమార్తె శృతి హాసన్‌ని హోస్ట్‌గా తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాసన్ హోస్ట్ చేయడం లేదట. కమల్ ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే రమ్యకృష్ణకు గతంలో బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం వుంది. తెలుగు బిగ్‌బాస్ హోస్ట్‌గా వున్న నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని తమిళ బిగ్‌బాస్‌కి కూడా రమృకృష్ణనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనిపై ఆమెను సంప్రదించగా, శివగామి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఈ వార్తల్లో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments