మెగా హీరోతో ర‌మ్య‌కృష్ణ‌

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

చిరంజీవి, నాగార్జున‌తో ర‌మ్య‌కృష్ణ‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. తాజాగా నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ఆమె 'శైల‌జా రెడ్డి అల్లుడు' సినిమాలో న‌టిస్తున్నారు. దీని త‌ర్వాత ఆమె చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ సినిమాలో న‌టించ‌నున్నారు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌ది చాలా కీల‌క‌మైన పాత్ర అట‌. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.

ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో బొమ‌న్ ఇంరానీ న‌టించ‌నున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో నాయిక ఎవ‌రు? ఇత‌ర న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులు ఎవ‌రు? వ‌ంటి వివ‌రాల‌న్నీ తెలియాల్సి ఉంది. ర‌మ్య‌కృష్ణ మాత్రం ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ గా ఉన్నారు. బాహుబలి చిత్రంలో శివ‌గామిదేవిగా న‌టించిన త‌ర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిన సంగ‌తి తెలిసిందే.

More News

త్రిష‌,స‌మంత‌ స్థానంలో అనుష్క‌?

త్రిష‌, స‌మంత  స్థానంలోకి అనుష్క రానుందా? ఇప్ప‌టికిప్పుడు వారి స్థానాల్లోకి అనుష్క ఎందుకు వ‌స్తోంది? అని అనుకుంటున్నారా?  నిజంగానే వారి స్థానంలోకి అనుష్క రానుంద‌ట‌.

ప్రభుదేవా సాంగ్‌ రీమిక్స్‌లో... 

శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం 'ప్రేమికుడు'. 1994లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఊర్వశి ఊర్వశి...' అనే పాట యూత్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

సైమా ప్రెస్ నోట్..

7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంది.

చిరుతో అనుష్క‌...

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందనుంది.

విడుదలకు సిద్ధమవుతున్న విజువల్ వండర్ 'సువర్ణసుందరి'

టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలకి విశేషమైన ఆదరణ చూరగొంటోంది. ఆ నేపధ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో ఎపిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం "సువర్ణసుందరి".