రమ్యకృష్ణ అంత పారితోషికం తీసుకుంటున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే టాలెంటెడ్ యాక్ట్రస్ రమ్యకృష్ణ. దాదాపు 15 సంవత్సరాల పాటు కథానాయికగా రాణించిన ఈ నటీమణి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తన హవాను కొనసాగిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌లో శివగామి పాత్రలో విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ.. తాజాగా ఆ పాత్రకిగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి విజయాలను అందుకుంటున్న రమ్య.. ప్రస్తుతం తన పారితోషికాన్ని కూడా అదే రేంజ్‌లో తీసుకుంటున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రంలో అత్త పాత్రలో నటిస్తున్నారు ఈ సీనియర్ కథానాయిక. ఈ సినిమా కోసం ఆమె 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్టు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం రోజుకి రూ.6 లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే.. 25 రోజులకుగాను రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్‌గా పొందుతున్నారన్న మాట. అంటే.. ఇప్పటి టాప్ హీరోయిన్‌లతో సమానంగా రమ్య పారితోషికం ఉందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments