ఆమె స్థానంలో రమ్యకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ఈ జూలై 10న విడుదకలు సిద్ధమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు ఇందులో తారాగణం. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రాధాన్యం ఉందని నిర్మాణ సమయంలో దర్శక, నిర్మాతలు తెలియజేశారు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ శివగామి అనే పాత్రలో నటించింది.
సినిమా ట్రైలర్ లో ఈ రోల్ చాలా పవర్ ఫుల్ గా కనపడుతుంది. సినిమాలో కూడా ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట. ముందుగా ఈ పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారట. అయితే శ్రీదేవి పులి చిత్రంలో నటించడాని ఆసక్తి చూపించిందట. దాంతో రాజమౌళి రమ్యకృష్ణని సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments