Ramya Krishna Meena:మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు.. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ, మీనా డిమాండ్

  • IndiaGlitz, [Sunday,October 08 2023]

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజాకు అలనాటి హీరోయిన్లు నుంచి మద్దతు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సీనియర్ నటీమణులు ఖుష్భూ, రాధికా శరత్ కుమార్, కవిత, నవనీత్ కౌర్ బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒకప్పటి హీరోయిన్లు మీనా, రమ్యకృష్ణ కూడా రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రోజా చేసే పోరాటానికి అండగా ఉంటా.. సుప్రీంకోర్టు స్పందించాలి..

నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా నిజ జీవితంలో అన్ని పాత్రల్లోనూ రోజా విజయవంతం అయ్యారని మీనా తెలిపారు. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఇంత నీచంగా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారు అనుకుంటున్నారా అని నిలదీశారు. బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన అభద్రత భావం, అసూయకి ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే రోజాకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజాతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి తనకు పూర్తిగా తెలుసని.. రోజా చాలా చిత్తశుద్ధితో పని చేస్తారని మీనా వెల్లడించారు. రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని వివరించారు.

బండారుపై ప్రధాని మోదీ, సీఎం జగన్ చర్యలు తీసుకోవాలి..

ఇక మరో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా బండారు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమన్నారు. బండారు సత్యనారాయణని క్షమించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ దుయ్యబట్టారు. దేశం ఎంతో పురోగతి చెందుతున్న ఈ తరుణంలో ఓ మహిళా మంత్రి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. సాటి మహిళగా, స్నేహితురాలిగా రోజాకి అండగా ఉంటానన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలు ఖండించాలని కోరారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ బండారు సత్యనారాయణపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రోజాతో నటించిన సహనటీమణులు అందరూ బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

More News

Bandla Ganesh:కూకట్‌పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Jagapathi Babu:వాళ్ల కష్టాల్ని, నా కష్టాలుగా భావించా.. నా అభిమానులే ఇలా చేస్తారనుకోలేదు : జగపతిబాబు సంచలన ప్రకటన

తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జగపతి బాబు.

K Raghavendra Rao:ఏపీ అంధకారంలో వుంది.. చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి : కే. రాఘవేంద్రరావు పోస్ట్ వైరల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న సంగతి తెలిసిందే.

KTR: జగనన్నతో మాట్లాడి జాగా ఇప్పిస్తా.. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్న కేటీఆర్

ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలపై తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వస్తున్నాయి. మా రాష్ట్రమే ప్రగతి సాధించాలి..

NBK Season 3:గెట్ రెడీ.. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అన్‌స్టాపబుల్ విత్ NBK 3వ సీజన్ వచ్చేస్తోంది..

నటసింహం నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్ చూపించిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.