మెగా హీరో చిత్రంలో రమ్యకృష్ణ?
Send us your feedback to audioarticles@vaarta.com
చక్రవర్తి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ.. ఆ తరువాత అదే మెగాస్టార్‌తో ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. అంజిలో ఓ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసారు కూడా. ఇప్పుడు చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోనూ రమ్యకృష్ణ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందించనున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. బోయపాటి దర్శకత్వం వహించిన తులసిలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వార్త వెలువడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com