అమ్మగా రమ్యకృష్ణ

  • IndiaGlitz, [Friday,December 21 2018]

మాహిష్మతి రాజమాత శివగామిగా అలరించాలన్నా, కంటి చూపుతో బెదిరించే శైలజారెడ్డిగా మెప్పించాలన్నా అది రమ్యకృష్ణకే సాధ్యైమెంది. ఇప్పుడు ఈమె మరో వైవిధ్యైమెన పాత్రలో ఆకట్టుకోనున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. పురట్చితైలెవి జయులలిత బయోపిక్‌లో అమ్మ పాత్రలో నటించనున్నారు.

ప్రస్తుతం తమిళనాట జయులలితకు సంబంధించి మూడు బయోపిక్‌లు రూపొందుతున్నాయి. ఇవిగాక మరో బయోపిక్ తెరకెక్కనుంది. అయితే సినిమాగా కాదు.. వెబ్ సిరీస్ రూపంలో.ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించబోతున్నారు. 30 ఏపిసోడ్స్ ఉండేలా ఈ బయోపిక్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారట.