డిస్నీ చేతికి రామోజీ ఫిలింసిటి?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా కూల్చేసిందనేది కొందరి వాదన. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతో పాటు రామోజీ ఫిలింసిటీ కూడా గుర్తొస్తుంది. ఏసియాలోనే దీనికి ప్రత్యేకమైన స్థానముంది. కరోనా కాటులో ఇది కూడా బలైందనేది బహిరంగ రహస్యమే. రామోజీ ఫిలింసిటీకి రోజుకు 10 వేల మంది సందర్శకులు వచ్చేవారు. సినిమా, సీరియల్ షూటింగ్స్.. బిజినెస్ ఈవెంట్స్, ఫంక్షన్స్.. ఆడియో లాంచ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండేది. కరోనా కారణంగా నాలుగు నెలలుగా షూటింగ్స్.. సందర్శకులు.. ఈవెంట్స్.. ఫంక్షన్స్ ఏమీ లేవు. దీంతో భారీగా నష్టం వచ్చిందని తెలుస్తోంది.
ఒక రోజుకు ఫిలింసిటీ ఆదాయం కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. అలాంటిది నాలుగు నెలలుగా మూతపడింది. మరోవైపు పత్రికలు మరీ దీన స్థితికి చేరుకున్నాయి. ఈనాడు పేపర్ అంటే ఓ బ్రాండ్. కానీ కరోనా కారణంగా లక్షల్లో ఉండే సర్కులేషన్.. వేలల్లోకి పడిపోయింది. మరోవైపు యాడ్స్ కూడా లేవు. దీంతో పత్రిక సైతం భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోందని టాక్. అన్నీటి పరంగా చూస్తే.. రామోజీ సంస్థలలో రామోజీ ఫిలింసిటీకి వేల కోట్లలో నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలింసిటీని డిస్నీ వరల్డ్‌కు లీజ్‌కు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మూడేళ్లకు అగ్రిమెంట్ జరిగినట్టు పుకారు షికారు చేస్తోంది.. దీనిపై నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments