బాబాయ్ పాటకు స్టెప్పులు ఇరగదీసిన కూతురు.. మెచ్చుకున్న సితార..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరుకారం మూవీ బాక్సాఫీస్ డిసెంట్ హిట్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని 'కుర్చీమడతపెట్టి' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సాంగ్ రీల్స్ కనపడుతున్నాయి. అంతేకాకుండా యూట్యూబ్‌లో రికార్డు మోత మోగిస్తోంది. ఈ పాట లిరికల్ వీడియోకి ఏకంగా 101 మిలియన్లకి పైగా వ్యూస్ రాగా.. ఒరిజినల్ వీడియో సాంగ్‌కి 57 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటలో మహేష్, శ్రీలీల డ్యాన్స్ అయితే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
ఇటీవల కొందరు విదేశీయులు కూడా ఈ పాట వింటూ జిమ్‌లో వర్క్‌వుట్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు భారతి కూడా ఈ పాటకు రీల్ చేసింది. ఇందులో ఆమె డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మహేష్ కూతరు, ఆమె చెల్లెలు సితార కూడా స్పందించింది. మెచ్చుకుంటూ కామెంట్లు కూడా చేసింది. ఇక మహేష్ కూడా ఈ వీడియోకు లైక్ కొట్టాడు. ఫ్యాన్స్ కూడా భారతి డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు.
ఇదిలా ఉంటే రమేష్ బాబు కూడా పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహించారు. అయితే అనారోగ్య సమస్యలతో 2022లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు జయకృష్ణ, కూతరు భారతి. అయితే వీరు బయట పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండరు. కానీ ఇప్పుడు ఒక్కసారి యాక్టివ్ అవుతూ కనిపిస్తోంది. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టా బయోలో 'Drive in Cinema' అంటూ రాసుకొచ్చింది. ఇది చూస్తుంటే ఆమె సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతుందో లేదో తెలియాంటే కొన్నిరోజులు ఆగాలి.
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌లో అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇందుకోసం మహేష్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో ఈ చిత్రంలో కనపడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా సెట్స్ పైకి త్వరలోనే వెళ్లనుంది. రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుని 2026లో విడుదల చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments