Ramcharan:ముంబై సిద్ధి వినాయకుని ఆలయంలో రాంచరణ్.. అయ్యప్పస్వామి మాల దీక్ష విరమణ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్‌గా నిలిచారు. సినిమాల్లో ఎంతో స్టైలిష్, హుందాగా కనిపించే చెర్రీ రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. మెగా వారసుడు బ్రాండ్‌తో పాటు గ్లోబల్ స్టార్ బ్రాండ్ ఉన్నా కూడా డౌన్ టూ ఎర్త్ ఉంటారు. అయ్యప్పస్వామికి చెర్రీ పెద్ద భక్తుడు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకుని దీక్షలో ఉంటారు. ఈసారి కూడా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న చరణ్.. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన చెర్రీ అయ్యప్ప మాలలో ఉన్నారని అందరికీ తెలిసింది.
చెర్రీ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ మీడియా..
గత ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి అయ్యప్ప స్వామి మాలలోనే రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అనంతరం అక్కడే ఓ హిందూ ఆలయంలో మాల విరమణ చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్ష విరమణ చేశారు. ఈ ఏడాది మెగా వారసురాలు జన్మించడంతో చెర్రీ అయ్యప్పస్వామి దీక్షను చేపట్టినట్లు చెబుతున్నారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు చాలా నిష్టగా ఉంటారు. చెర్రీ కూడా మాలలో ఉన్నప్పుడు నిష్టగా కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. నలుపు రంగు దుస్తులను ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా జీవిస్తారు. అలాగే నిద్ర పోయే సమయంలో కఠిక నేల మీదే పడుకుంటారు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన చెర్రీ చెప్పులు లేకుండా ఉండటంతో బాలీవుడ్ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అలాగే భక్తులు కూడా రామ్ చరణ్ సింప్లిసిటీని చూసి ముక్కున వేలు వేసుకన్నారు.
ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తున్న చెర్రీ..
ప్రస్తుతం చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు. ఇక చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి లీక్ అయిన ఓ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి అధికారికంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవి కాలంలో మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంతోనూ ఓ చిత్రానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments