Ramcharan:ఘనంగా ప్రారంభమైన రామ్‌చరణ్ కొత్త సినిమా

  • IndiaGlitz, [Wednesday,March 20 2024]

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్, ఆస్కార్ అవార్డు గ్రహాత ఏఆర్ రెహమాన్, ప్రముఖ నిర్మాతలు బోనీ కపూర్, అల్లు అరవింద్ కూడా అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

RC16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చెర్రీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ సమర్పిస్తుండగా.. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై వెంకట సతీశ్‌ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్‌ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. మ‌రోవైపు ఈ సినిమాకు ‘పెద్ది' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

ఇక చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్‌ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 90శాతం పైగా కంప్లీట్ అయింది. ఇటీవలే ఓ రాజకీయ సభకు సంబంధించిన సన్నివేశాలను వైజాగ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో చరణ్ పాల్గొన్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, జయరాం, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర వంటి స్టార్ నటులు కూడా పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమా డిజిటల్ రైట్స్‌ని అన్ని భాషల్లో కలిపి అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.110 కోట్లకు కొనిందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇదిలా ఉంటే ఈ మూవీ కథ ఇదేనంటూ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో.. చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. అవినీతి నాయకులను ఎదుర్కొంటూ, ఎన్నికలను రూల్స్‌కి తగ్గట్టు నిర్వర్తిస్తూ ఎలాంటి గేమ్ ఆడాడు అనేది స్టోరీ లైన్ అని తెలిపింది. ఇక ఇందులో తండ్రిగా చెర్రీ ఫ్లాష్ బ్యాక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో ఈ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది.

 

 

More News

Election:దేశంలో మొదలైన ఎన్నికల సందడి.. తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల..

దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

CP Radhakrishnan:తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అధారే

Pawan Kalyan: లక్ష మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురం నాయకులతో జనసేనాని..

ఇక నుంచి పిఠాపురంను తన స్వస్థలం చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పిఠాపురంకు చెందిన స్థానిక నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.

Ustaad Bhagat Singh:'గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం'.. అదిరిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్లేజ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందింది.  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'

CM Jagan:'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు సిద్ధమైన సీఎం జగన్.. రూట్ మ్యాప్ ఖరారు..

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి.